Kiccha Sudeep: పాన్‌ఇండియా.. బాలీవుడ్‌కి సక్సెస్‌ లేదు: సుదీప్‌

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు చేయడం ప్రారంభించిందని, కాకపోతే సక్సెస్‌ మాత్రం పొందలేకపోతుందని....

Published : 26 Apr 2022 01:43 IST

హిందీ పరిశ్రమపై నటుడు షాకింగ్‌ కామెంట్స్‌

బెంగళూరు: బాలీవుడ్‌ చిత్రపరిశ్రమపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు చేయడం ప్రారంభించిందని, కాకపోతే సక్సెస్‌ మాత్రం పొందలేకపోతోందని ఆయన అన్నారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ‘ఆర్‌: ది డెడ్‌లిస్ట్‌ గ్యాంగ్‌స్టర్‌ ఎవర్‌’ అనే కన్నడ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో సుదీప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది చిత్రాలు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఇటీవల కన్నడ చిత్రపరిశ్రమ నుంచి విడుదలైన ‘కేజీయఫ్‌-2’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

‘‘కన్నడ చిత్రపరిశ్రమ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని ఎవరో అన్నారు. అందులో చిన్న కరెక్షన్‌ ఏంటంటే.. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు. నిజం చెప్పాలంటే హిందీ వాళ్లే ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, ఇలా దక్షిణాది భాషల్లోనూ తమ చిత్రాలను డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. కానీ, వాళ్లకు సరైన విజయం రావడం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే.. పాన్‌ ఇండియా అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా మనం సినిమాలు చేస్తున్నాం’’ అని సుదీప్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని