వారు వింటున్నారని ఆశిస్తున్నా: అభిమానులకు సుదీప్‌ రిప్లై

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ ఎక్స్‌ వేదికగా అభిమానులతో మాట్లాడారు.

Published : 15 Feb 2024 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌(Kiccha Sudeep). గతంలో తాను సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. దీనిపై స్పందించిన అభిమానులు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయండని ఎక్స్‌ వేదికగా కోరారు. ‘‘నేను ఇచ్చిన మాటను నెరవేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. నాతోపాటు చిత్ర బృందం వేగంగా వర్క్‌ చేయాలి. ఇప్పటికైనా వింటుందని ఆశిస్తున్నా. మీ మాటను నేను హెచ్చరికగా తీసుకుంటున్నా. మీరు కోరుకునేవిధంగా సినిమాలు చేస్తాను’’అని సుదీప్‌ సరదాగా సమాధానం చెప్పారు. 

‘‘నా 28 ఏళ్ల కెరీర్‌లో నేను ఉత్తమ నటుడినని చెప్పను. కానీ నాకిచ్చిన ప్రతీ పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నాకు దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా’’అని సుదీప్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు. 

సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’(Vikrant Rona) తర్వాత మ్యాక్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్‌ కార్తికేయన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరో రెండు, మూడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని సన్నిహత వర్గాల సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో సుదీప్‌ బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని