Acharya: ‘ధర్మస్థలి’.. ఎలా క్రియేట్‌ చేశారంటే..!

‘ఆచార్య’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది? అని వెతకడం ప్రారంభిస్తారని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలో....

Published : 24 Apr 2022 14:59 IST

20 ఎకరాల్లో.. కోట్లు ఖర్చు పెట్టి..

హైదరాబాద్‌: ‘ఆచార్య’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది? అని వెతకడం ప్రారంభిస్తారని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలో కీలకంగా చెప్పుకునే ‘ధర్మస్థలి’ ఎపిసోడ్‌పై ఆయన స్పందించారు. ‘ధర్మస్థలి’ని ఎలా సృష్టించారో చెప్పారు. ‘‘పురాతన గాథలు, ఎన్నో నమ్మకాలు కలిగిన అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతమది. దాని పేరు ‘ధర్మస్థలి’. కథ ఎక్కువగా ధర్మం అనే కాన్సెప్ట్‌ చుట్టే ఉంటుంది కాబట్టి.. ఆ టెంపుల్‌ టౌన్‌కి ‘ధర్మస్థలి’ అనే పేరు పెడితే బాగుంటుందని భావించాం. మా అందరికీ ఆ పేరు బాగా నచ్చింది. ‘ధర్మస్థలి’ ఎపిసోడ్‌ షూట్‌కి మాకొక అందమైన టెంపుల్‌ టౌన్‌ కావాలి. అందుకోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు మాకు నచ్చాయి. షూటింగ్‌ సాధ్యం కాదేమో అనిపించింది. అలా, చివరికి మేము ‘ధర్మస్థలి’ సృష్టించాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. దాంతో మా ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ఎన్నో ప్రాంతాలకు వెళ్లి.. పరిశోధన చేశారు. సెట్‌ని నిర్మించే సమయంలో మేమూ పూజలు చేశాం. దేవాలయాల పవిత్రత ఎక్కడ దెబ్బతినకుండా తీర్చిదిద్దాం. సినిమా చూసినప్పుడు ‘ధర్మస్థలి’ ఎక్కడుంది? అక్కడికి వెళ్దామనే ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అదొక అందమైన ప్రదేశం. 20 ఎకరాల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన బిగ్గెస్ట్‌ సెట్‌ ఇది’’ అని కొరటాల తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఈ టీమ్‌ మొత్తం ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని