Shyamala Devi: ప్రభాస్ ప్రేమ పెళ్లిపై కృష్ణంరాజు సతీమణి కామెంట్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ ‘రాధేశ్యామ్’ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో.. అదే విధంగా ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అందరూ మాట్లాడుకుంటున్నారు...
ఆమె మా ఇంటి అమ్మాయిలానే..: శ్యామలాదేవి
హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ ‘రాధేశ్యామ్’ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో.. అదే విధంగా ప్రభాస్ పెళ్లి కోసమూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన డేటింగ్లో ఉన్నారని సోషల్‌మీడియా వేదికగా పలు వార్తలు వచ్చాయి. ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్పందించారు. ప్రభాస్ వ్యక్తిత్త్వంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్-కృష్ణంరాజు మధ్య ఉన్న అనుబంధం చూస్తే ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయని ఆమె అన్నారు.
‘‘ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవం. పెద్దలతో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. వాళ్లమ్మ అంటే అమితమైన ప్రేమ, గౌరవం. మా కుటుంబం మొత్తాన్ని ఎంతో బాగా చూసుకుంటాడు. ఇక, పెదనాన్న అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. గతేడాది కృష్ణంరాజుగారి కాలికి చిన్న గాయమైంది. దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకెంతో భయం, కంగారుగా అనిపించింది. ‘‘ఏం కాదు కన్నమ్మ.. ఇది చాలా చిన్న గాయం. త్వరగానే తగ్గిపోతుంది. మేమంతా ఉన్నాం. మీరు అస్సలు కంగారు పడొద్దు’’ అని ప్రభాస్ ధైర్యం చెప్పాడు. ఆ మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయి. సర్జరీ అయ్యాక కూడా... ‘‘పెదనాన్న.. త్వరలోనే మనం జపాన్ వెళ్దాం. అక్కడ సినిమా ప్రమోషన్స్ కలిసి చేద్దాం. మన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు’’ అంటూ ప్రతిసారీ కృష్ణంరాజుగారిలో ఒక ధైర్యాన్ని నింపుతుంటాడు. ప్రభాస్ మాటలకు ఆయన బాగా నవ్వుకుంటారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి’’
‘‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితో మాకు మంచి అనుబంధాలున్నాయి. హీరోలందర్నీ మేము అభిమానిస్తూనే ఉంటాం. నాకు వ్యక్తిగతంగా చిరంజీవి, శోభన్‌బాబు అంటే అభిమానం. చిరంజీవి డ్యాన్స్ బాగా చేస్తారు. ఇక, ప్రభాస్ అందరితోనూ స్నేహంగా ఉంటాడు. ముఖ్యంగా చరణ్, ఉపాసన.. ప్రభాస్‌కి బెస్ట్ ఫ్రెండ్స్. చరణ్ కూడా పెద్దలకు గౌరవమిస్తాడు. మేము ఎక్కడ కనిపించినా.. వెంటనే వచ్చి పలకరిస్తాడు. ఉపాసన ఎంతో మంచి అమ్మాయి. కృష్ణంరాజుగారికి సర్జరీ జరిగినప్పుడు ఆమే అన్నీ దగ్గరుండి చూసుకుంది. నా కూతురిలా అనిపించింది. అంత మంచి కోడలు, కొడుకు ఉన్నందుకు చిరంజీవి గారు అదృష్టవంతులు’’
‘‘ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులతోపాటు మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఆలస్యమవుతోంది. ప్రభాస్ ప్రేమలో ఉన్నారని వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలే. ప్రేమ పెళ్లి చేసుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదు. దేనికైనా సమయం రావాలి. త్వరలోనే శుభఘడియలు వస్తాయని అనుకుంటున్నా. ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ సమయంలో ప్రభాస్-పూజాకు గొడవ అయిందని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. మా అబ్బాయి అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు’’ అని శ్యామలా దేవి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్‌తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!