Kriti Sanon: ప్రభాస్‌తో ప్రేమాయణం వార్తలు.. వరుణ్ వ్యాఖ్యలతో బాధపడ్డా: కృతిసనన్
తన సినీ కెరీర్ గురించి నటి కృతిసనన్ (Kriti Sanon) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . తాను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు అందరూ షాక్ అయ్యారని చెప్పింది. అనంతరం ఆమె ప్రభాస్‌తో రిలేషన్‌షిప్ గురించి స్పందించింది.
ముంబయి: పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో తాను ప్రేమలో ఉన్నానంటూ గతంలో నటుడు వరుణ్‌ధావన్ (Varun Dhawan) చేసిన వ్యాఖ్యలపై తాజాగా కృతిసనన్ (Kriti Sanon) స్పందించింది. రియాల్టీ షో వేదికగా వరుణ్ అన్న మాటలు తనని ఎంతగానో బాధించాయని ఆమె తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘‘ప్రభాస్‌తో నేను ప్రేమలో ఉన్నానంటూ వరుణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో ఇబ్బందిపెట్టాయి. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ఆయనతో చెప్పాను. ఆయన వెంటనే.. ‘వరుణ్ ఎందుకు అలా చెప్పాడు?’ అని ప్రశ్నించాడు. ‘ఏమో నాక్కూడా తెలియదు. వరుణ్ పిచ్చితనంతో అలా చెప్పాడు’ అని బదులిచ్చాను’’ అని వివరించింది.
‘‘నేను పరిశ్రమలోకి అడుగుపెడతాను అన్నప్పుడు అందరూ కాస్త షాక్ అయ్యారు. పరిశ్రమ అంటేనే ఒక వింత ప్రపంచమని, ఇక్కడ ఎక్కువగా నెగటివిటీ ఉంటుందని చెప్పారు. ఇక్కడ నెట్టుకు రావడం కష్టమని, సురక్షితం కాదని, ఒక్కసారి నటి అయితే ఆ అమ్మాయికి పెళ్లి కావడం కూడా కష్టమేనని చెప్పారు. పెళ్లి విషయంలో వాళ్ల మాటలు విని నవ్వుకున్నాను. అలాగే నా వయసులో ఉన్నవాళ్లూ ఇలాగే ఆలోచిస్తుంటారా? అని భయపడ్డాను’’ అంటూ (Kriti Sanon) పేర్కొంది.
‘ఆదిపురుష్’ (Adi Purush) రిలీజ్ కోసం కృతిసనన్ (Kriti Sanon) ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన ఈ సినిమాలో కృతి.. సీత పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా గతేడాది తాను నటించిన ‘బేడియా’ ప్రమోషన్స్‌లో భాగంగా సహనటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కృతి రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి వరుణ్ మాట్లాడుతూ..‘‘కృతి పేరును ఓ వ్యక్తి తన గుండెల్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం తను ముంబయిలో లేడు. దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అంటూ ప్రభాస్ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని, ప్రభాస్ తనకు స్నేహితుడేనంటూ కృతి వివరణ ఇచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ఘోరం.. కారును ఢీకొన్న బస్సు.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Priyanka Chopra: ప్రియాంక కారణంగా షూట్ వాయిదా.. 20 ఏళ్ల తర్వాత వెల్లడించిన బీటౌన్ నిర్మాత
-
India News
Kejriwal: ఎల్జీ సర్.. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యత మీదే.. ఏదైనా చేయండి! : కేజ్రీవాల్
-
Sports News
MS Dhoni: చంద్రుడిపైకి వెళ్లినా సీఎస్కే అభిమానులు ఉంటారు : ఇర్ఫాన్ పఠాన్