Label: ఓటీటీలో మరో లీగల్‌ డ్రామా.. ‘లేబుల్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

తమిళ నటుడు జై కీలక పాత్రలో రూపొందిన లీగల్‌ డ్రామా ‘లేబుల్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 08 Nov 2023 17:47 IST

హైదరాబాద్‌:  ‘మేము ఎవరన్నది ఎవరెవరో డిసైడ్‌ చేస్తున్నారు. కానీ, మేమెవరన్నది మేము చెప్పాలి’ అంటున్నారు తమిళ కథానాయకుడు జై (Jai). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘లేబుల్’ (Label). అరుణ్‌రాజా కామరాజ్‌ తెరకెక్కించారు. తాన్య హోప్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో నవంబరు 10వ తేదీ నుంచి తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది. లీగల్‌ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ను హాట్‌స్టార్‌ విడుదల చేసింది. జడ్జి అవుదామనుకున్న ఓ యువకుడి కలను కొందరు వ్యక్తులు ఎందుకు అడ్డుకున్నారు? దాని వెనుక కారణం ఎవరు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని