Nayanthara: ‘నయనతార 75’.. ఆసక్తికరంగా టైటిల్‌ గ్లింప్స్‌.. పేరేంటంటే?

నయనతార కొత్త సినిమా టైటిల్‌ ఖరారైంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ పేరేంటంటే?

Published : 24 Oct 2023 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో దర్శకుడు నీలేష్ కృష్ణ (Nilesh Krishna) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా మంగళవారం టైటిల్‌ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు గ్లింప్స్‌ విడుదల చేశారు. హీరోయిన్‌ పాత్ర, కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసే వీడియో ఆసక్తికరంగా సాగింది. ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే.. ‘అన్నపూరణి’. నయనతార ఇందులో రకరకాల వంటలు ప్రయత్నిస్తూ, అదే రంగంలో స్థిరపడానుకునే అమ్మాయిగా నటిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. #Nayanthara75 (నయనతారకు 75వ చిత్రం) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాని గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘బ్రహ్మాస్త్రం’లోని ఈ లోపాలను పార్ట్‌-2లో సరిచేస్తాం: రణ్‌బీర్‌ కపూర్‌

ప్రముఖ దర్శకుడు శంకర్‌ శిష్యుడే ఈ నీలేష్‌ కృష్ణ. జై, సత్యరాజ్‌, కార్తీక్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ సరసన నయనతార నటించిన ‘జవాన్‌’ ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని