LGM: ధోనీ సతీమణి నిర్మించిన ‘ఎల్‌జీఎం’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

హరీశ్‌ కల్యాణ్‌ (Harish Kalyan), ఇవానా (Ivana) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 28 Sep 2023 12:35 IST

హైదరాబాద్‌: క్రికెట‌ర్ ధోని భార్య సాక్షి నిర్మించిన తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’. హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సరికొత్త తరం లవ్‌ డ్రామా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ఈ సినిమాకు రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించగా నటి నదియా కీలకపాత్రలో కనిపించారు. 

 అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు

క‌థేంటంటే: గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా (ఇవానా) ఒకేచోట ప‌నిచేస్తూ రెండేళ్ల‌పాటు డేటింగ్ చేస్తారు. ఆ త‌ర్వాత గౌత‌మ్ పెళ్లి ప్ర‌తిపాద‌న తీసుకురావ‌డంతో మీరా ఓకే చెబుతుంది. తీరా ఇరు కుటుంబాలు క‌లిసి మాట్లాడుకునే స‌మ‌యంలో మీరా ఓ ష‌ర‌తు విధిస్తుంది. పెళ్లయిన తర్వాత అత్తతో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ముందే ఆమెతో క‌లిసి కొన్ని రోజులు గడపాలని కోరుకుంటుంది. అందుకోసం ఓ టూర్ ప్లాన్ చేస్తుంది. ఈ వింత ప్రతిపాదనకు గౌత‌మ్ అంగీకరించి ఆఫీస్ ట్రిప్ అని అబ‌ద్ధం చెప్పి త‌న త‌ల్లిని ఒప్పిస్తాడు. అలా అంద‌రూ క‌లిసి కూర్గ్‌కి బ‌య‌ల్దేరతారు. వెళ్లాక ఏం జ‌రిగింది? గౌత‌మ్ త‌ల్లితో మీరా క‌లిసిపోయిందా? (LGM Movie OTT) లేదా?గౌత‌మ్‌తో మీరా పెళ్లికి ఒప్పుకొందా? త‌దిత‌ర విష‌యాల్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని