Mohanlal: మోహన్‌లాల్‌ తాజా చిత్రం.. ఆ ఒక్క కామెంట్ ఎంతో బాధించింది: దర్శకుడు లిజో జోస్‌

మోహన్‌లాల్‌ తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’పై వచ్చిన కామెంట్లలో ఒకటి తననెంతో బాధించిందని దర్శకుడు తెలిపారు.

Published : 01 Feb 2024 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‌లాల్‌ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’ (Malaikottai Vaaliban). లిజో జోస్‌ పెలిసేరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ సినిమాపై వచ్చిన విమర్శల గురించి తాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక కామెంట్‌ తనను ఎంతో బాధించిందన్నారు.

‘నేను విమర్శలను స్వాగతిస్తాను. వాటిలో కొన్ని మనసుకు బాధ కలిగిస్తాయి. సినిమాను ఎంతో కష్టపడి రూపొందిస్తాం. అది విడుదలయ్యాక మొదటి రెండు రోజుల్లో వచ్చే కామెంట్స్ దానిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది సరైంది కాదు. ఒక వర్గం ప్రేక్షకులు విమర్శించడమే లక్ష్యంగా కామెంట్స్‌ చేస్తుంటారు. వాళ్లకు సినిమా నచ్చలేదు కాబట్టి ప్రపంచంలో ఎవరూ దాన్ని చూడకూడదు అనుకుంటారు. వారి కామెంట్స్‌ వల్ల సినిమా కోసం ఏడాదిన్నర పాటు పడిన కష్టమంతా కనుమరుగైపోతుంది. ‘మలైకోటై వాలిబన్‌’ రిలీజైన కొంతసేపటికే ‘ఇప్పటివరకు రిలీజైన మలయాళ చిత్రాలన్నింటిలో ఇదే చెత్త సినిమా’ అని కొందరు కామెంట్ చేశారు. అది నన్ను ఎంతో బాధించింది. అందుకే మీడియా ముందుకు వచ్చి సినిమాను వివరించాను. మూవీ చూడాలని లేకపోతే వదిలేయండి.. కానీ, ఇతరులను చూడొద్దని ఒత్తిడి చేయొద్దని విమర్శకులను వేడుకుంటున్నా’ అని చెప్పారు.

వాళ్ల కోసమే డీప్‌ఫేక్‌ గురించి మాట్లాడాను..: రష్మిక

పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాన్ని చూపించారు. ఇందులో మోహన్‌లాల్‌ కొత్త అవతారంలో కనిపించారు. సోనాలి కులకర్ణి కీలకపాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని