Lokesh Kanagaraj: కాలి నడకన తిరుమలకు లోకేశ్‌ కనగరాజ్‌.. వీడియో వైరల్‌

‘విక్రమ్‌’ (Vikram) తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన చిత్రం ‘లియో’ (LEO). దీంతో ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

Published : 12 Oct 2023 13:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లియో’ (LEO) దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తిరుమల వెళ్లారు. బుధవారం రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన లోకేశ్‌ అభిమానులకు అభివాదం చేశారు. పలువురితో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సినిమా విజయం అందుకోవాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ott movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

విజయ్‌ - లోకేశ్‌ కాంబోలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లియో’. త్రిష కథానాయిక. అర్జున్‌ సర్జా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ దాస్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు. అక్టోబర్‌ 19న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై ఎన్నో అంచనాలు పెంచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని