Mahesh babu: ‘గుంటూరు కారం’ సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైరల్‌

‘గుంటూరు కారం’ విజయోత్సవాలు మహేశ్‌ బాబు ఇంట్లో సందడిగా జరిగాయి.

Updated : 16 Jan 2024 10:24 IST

హైదరాబాద్‌: ఈ సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మహేశ్‌ బాబు (Mahesh babu) ఇంట్లో సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో దిల్‌ రాజు దంపతులు, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొనగా.. సితార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మహేశ్‌ బాబు..  ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించారు.

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమణ పాత్రలో మహేశ్‌ మాస్ లుక్‌లో అలరించగా.. శ్రీలీల (Sreeleela) డ్యాన్స్‌తో జోష్‌ పెంచింది. రమ్యకృష్ణ, జయరామ్‌, ప్రకాశ్‌ రాజ్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. మూడు రోజుల్లో రూ.164 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని