Vijay: విజయ్‌పైకి చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి .. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..!

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ (Vijay)కు చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు.

Updated : 29 Dec 2023 18:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు విజయ్‌ (Vijay)కు చేదు అనుభవం ఎదురైంది. నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌ అంటే గిట్టని వారే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించడానికి ఇది సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ram charan: ఉపాసన చెప్పినట్లు నేను వినాలనుకుంటున్నా: రామ్‌ చరణ్‌

కెప్టెన్‌ విజయకాంత్‌తో విజయ్‌ కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. విజయకాంత్‌, విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ మంచి స్నేహితులు. చంద్రశేఖర్‌ దర్శకత్వంలో విజయకాంత్‌ పలు చిత్రాల్లో నటించారు. ఇక, విజయ్‌ తొలి విజయం అందుకున్న ‘సెంధూర పాండి’లో విజయకాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కెప్టెన్‌ పారితోషికం కూడా తీసుకోలేదు. గురువారం విజయకాంత్‌ ఆకస్మిక మరణవార్తతో విజయ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్‌ పార్థివదేహానికి తుది నివాళి అర్పించారు. విజయ్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో డీఎండీకే కార్యాలయ ప్రాంగణంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని