MAA elections: ‘మా’ ఎన్నికలు.. మంచు విష్ణు కీలక నిర్ణయం?

MAA elections: ‘మా’ ఎన్నికలకు సంబంధించి మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated : 31 Jul 2023 18:26 IST

హైదరాబాద్‌: సాధారణ ఎన్నికల కంటే రసవత్తరంగా సాగాయి గత ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ పోటీపడగా, విష్ణు (manchu vishnu) విజయం సాధించి, ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ‘మా’ సర్వ సభ్య సమావేశంలో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. తన నిర్ణయాన్ని సర్వసభ్య సమావేశంలో సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలానికి జరిగే ‘మా’ ఎన్నికలు ఈసారి సెప్టెంబరులో జరగాల్సి ఉండగా, వాటిని వచ్చే ఏడాది మేలో నిర్వహించాలని తీర్మానించినట్లు పలువురు సభ్యుల ద్వారా తెలిసింది. అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగానే ఎన్నికలను మేలో జరపాలని నిర్ణయించారని సమాచారం. ఎన్నికల గడువు సమీపించేలోగా సభ్యులకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలనే ఆలోచనలో మంచు విష్ణు ఉన్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని