Aadavallu Meeku Joharlu: శర్వానంద్‌ పెళ్లి కష్టాలు.. ‘మాంగల్యం తంతునా’ పాట విన్నారా!

కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినప్పుడు సగటు యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో పాట రూపంలో వినిపించారు నటుడు శర్వానంద్‌.

Published : 23 Feb 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినప్పుడు సగటు యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో పాట రూపంలో వినిపించారు నటుడు శర్వానంద్‌. ఈయన హీరోగా రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ‘మాంగల్యం తంతునా.. ఇది మన లైఫ్‌లో జరుగునా’ అనే గీతాన్ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ‘జీలకర్ర బెల్లం బదులు నా తలపై టోపీ పెట్టారు’, ‘దిష్టి చుక్కే బుగ్గనపెట్టకుండా నన్నే దిష్టిబొమ్మలా మార్చేశారు’ అనే లైన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్‌ రచించిన ఈ పాటను జస్ప్రీత్‌ ఆలపించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక సందడి చేయనుంది. రాధికా శరత్‌కుమార్‌, ఖుష్బూ, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ ఆడవాళ్ల కథేంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని