ఉత్కంఠగా ‘మరణం’ టీజర్‌

మంచి కంటెంట్‌ ఉంటే హారర్‌ చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక

Updated : 27 Dec 2022 20:09 IST

హైదరాబాద్‌: మంచి కంటెంట్‌ ఉంటే హారర్‌ చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మరణం’. వీర్‌ సాగర్‌ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమా టీజర్‌ను సి.కల్యాణ్ తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజర్‌ చాలా బాగుందని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. మంచి కథ దొరికితే వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక కాంబినేషన్‌లో తాను ఓ సినిమా చేస్తానని అన్నారు.

మంచి మనసున్న నిర్మాత సి.కల్యాణ్‌ అని, అలాంటి వ్యక్తి తన మొదటి సినిమా టీజర్‌ను విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు వీర్‌సాగర్‌. కథానాయిక శ్రీ మాట్లాడుతూ.. ‘నేను కథను నమ్ముతాను. వీర్‌సాగర్‌ కథ నచ్చి సినిమా చేస్తున్నా. మాలాంటి చిన్న నటులకు కల్యాణ్‌గారు గాడ్‌ ఫాదర్‌’ అని అన్నారు. శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ‘మరణం’ తెరకెక్కుతోంది. మనోజ్ కుమార్ చేవూరి స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు