Mayapetika: ఓటీటీలోకి పాయల్‌ రాజ్‌పుత్‌ ‘మాయాపేటిక’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాయాపేటిక’. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఎప్పుడు, ఎక్కడంటే?

Published : 06 Sep 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సిమ్రత్‌ కౌర్‌ (Simrat Kaur), సునీల్‌ (Sunil), శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక (Maya Petika). రమేశ్‌ రాపార్తి దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ మంగళవారం ఖరారైంది. ‘ఆహా’ (Aha)లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ని పంచుకుంది. మానవ జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌ ఇతివృత్తంగా సాగే కథతో రూపొందిన సినిమా ఇది. ఈ ఏడాది జూన్‌ 30న థియేటర్లలో విడుదలైంది. 

థియేటర్‌లో విడుదలైనా, ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాని సినిమాలివే!

ఇదీ కథ: సినిమా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌కు నిర్మాత సెల్‌ఫోన్‌ను కానుకగా ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల తనకు కాబోయే భర్తతో రాజ్‌పుత్‌కు గొడవలు తలెత్తుతాయి. ఆ సమస్యకు పరిష్కారంగా ఫోన్‌ను అసిస్టెంట్‌కు ఇస్తుంది రాజ్‌పుత్‌. ఆ అసిస్టెంట్‌ కొన్నాళ్లు వినియోగించిన ఫోన్‌ చేతులు మారుతూ పాకిస్థాన్ చేరుకుంటుంది. అసలు ఆ ఫోన్ వల్ల.. కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలేంటి? అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్)ల ప్రేమ ఎలా మొదలైంది? బతుకుదెరువు కోసం వేషాలు వేసే శ్రీను (శ్రీనివాసరెడ్డి) జీవితంలో వచ్చిన మార్పేంటి? తదితర ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని