Meera Chopra: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘బంగారం’ హీరోయిన్‌

హీరోయిన్‌ మీరా చోప్రా పెళ్లి వైభవంగా జరిగింది. జైపుర్‌లోని ఓ రిసార్ట్‌ ఆ వివాహ వేడుకకు వేదికైంది.

Published : 13 Mar 2024 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటి మీరా చోప్రా (Meera Chopra) వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త రక్షిత్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఏడడుగులు వేశారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. జైపుర్‌లోని ఓ రిసార్ట్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ వెడ్డింగ్‌కు కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. వేడుక ఫొటోలను మీరా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన మీరా 2005లో ‘అన్బే ఆరుయిరే’ (తమిళ్‌) సినిమాతో తెరంగేట్రం చేశారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన ‘బంగారం’ (Bangaram)తో టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇచ్చారు. చలాకీ అమ్మాయి సంధ్యగా నటించి తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘వాన’ (Vaana), ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ (Greeku Veerudu)లో మెరిశారు. తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఆమె కోలీవుడ్‌, బాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని