Rashmika: తక్షణ చర్యలు అవసరం: రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై ఎమ్మెల్సీ కవిత

రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 06 Nov 2023 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandanna) మార్ఫింగ్‌ వీడియోపై భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు. రష్మికను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం దారుణమన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ఆన్‌లైన్‌లో ఎవరివైనా వీడియోలు మ్యానిప్యులేట్‌ చేయడం ఎంత సులభమో ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు అవసరమని డిమాండ్‌ చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్‌ ‘ఎక్స్‌’ ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ.. సమగ్ర చర్యల కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు, కవిత పోస్ట్‌పై రష్మిక స్పందించారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

నాకెంతో బాధగా ఉంది: మార్ఫింగ్‌ వీడియోపై రష్మిక పోస్ట్‌

అసలేం జరిగిందంటే: రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ఆదివారం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా స్టార్‌ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. అందులో రష్మిక ముఖం పెట్టారు. చూడటానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు క్రియేట్‌ చేసి సెలబ్రిటీ పరువుకు భంగం కలిగించడం నేరమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సహా పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని