Thaman: డ్యాన్స్‌తో అదరగొట్టేసిన తమన్‌.. వీడియో వైరల్‌

తరచూ తన మ్యూజిక్‌తో సినీ ప్రియుల మతిపోగొట్టే సంగీత దర్శకుడు తమన్‌ తాజాగా తనదైన డ్యాన్స్‌తో అదరహో అనిపించారు. ‘కళావతి.. కళావతి’ అంటూ ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌తో కలిసి ఆయన కాలు...

Published : 23 Feb 2022 14:39 IST

హైదరాబాద్‌: తరచూ తన మ్యూజిక్‌తో సినీ ప్రియులను అలరించే సంగీత దర్శకుడు తమన్‌ తాజాగా తనదైన డ్యాన్స్‌తో అదరహో అనిపించారు. ‘కళావతి.. కళావతి’ అంటూ ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌తో కలిసి ఆయన కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా పేరు తెచ్చుకున్న తమన్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ ఆల్బమ్‌ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదలైంది. ‘కళావతి కళావతి’ అంటూ సాగే ఈ పాటలో మహేశ్‌బాబు వేసిన కూల్‌+క్లాసీ డ్యాన్స్‌ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఈ పాటకు పలువురు సోషల్‌మీడియా సెలబ్రిటీలు రీల్స్‌ క్రియేట్‌ చేసి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఇటీవల మహేశ్‌ కుమార్తె సితార సైతం ‘కళావతి’ రీల్స్‌తో అదరగొట్టగా.. తాజాగా తమన్‌, నృత్యదర్శకుడు శేఖర్‌ మాస్టర్‌.. సిగ్నేచర్‌ స్టెప్పులను రీక్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో తమన్‌, సితారలతోపాటు ‘కళావతి’ రీల్స్‌తో మెప్పించిన సోషల్‌మీడియా ఫేమ్స్‌పై ఓ లుక్కేయండి..!










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని