Ramarao On Duty: ‘నా పేరు సీసా..’ ట్రెండింగ్‌లో శ్రేయా ఘోషల్‌ పాడిన ఐటమ్‌ సాంగ్‌

‘నా పేరు సీసా.. నా పేరు సీసా.. ఒకరికి నే తేనే సీసా.. ఒకరి నే కల్లు సీసా’ అంటూ తనదైన వాయిస్‌తో పాట పాడి అదరగొట్టారు శ్రేయా ఘోషల్‌. రవితేజ(Raviteja)

Published : 02 Jul 2022 17:48 IST

హైదరాబాద్‌: ‘నా పేరు సీసా.. నా పేరు సీసా.. ఒకరికి నే తేనే సీసా.. ఒకరి నే కల్లు సీసా’ అంటూ తనదైన వాయిస్‌తో పాట పాడి అదరగొట్టారు శ్రేయా ఘోషల్‌. రవితేజ(Raviteja) కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty). దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik), రజిషా విజయన్‌ కథానాయికలు. శనివారం ఈ చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌ ‘నా పేరు సీసా’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. శ్యామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.  శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ఇక ఈ ఐటమ్‌ సాంగ్‌కు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించగా, అన్వేషి జైన్‌ స్టెప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని