చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌

తన అల్లుడు చైతన్యను నటుడు నాగబాబు సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసి బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోని సైతం ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ...

Updated : 14 Sep 2023 17:06 IST

హైదరాబాద్‌: తన అల్లుడు చైతన్యను నటుడు నాగబాబు సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నాను.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్‌ డిస్కవరీ తీసుకున్నాం’ అని నాగబాబు తెలిపారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారుని బహూకరించారు.

నాగబాబు కుమార్తె నిహారికకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన అతి తక్కువమంది ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని