ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ooru peru bhairavakona ott release date: సందీప్‌ కిషన్‌ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది.

Updated : 08 Mar 2024 15:15 IST

హైదరాబాద్‌: సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ఊరు పేరు భైరవకోన’ (ooru peru bhairavakona). కావ్య థాపర్‌ (Kavya Thapar), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) కథానాయికలు. రాజేష్‌ దండా నిర్మించారు. ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన...’ అంటూ ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్‌లోనూ థ్రిల్‌ పంచింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ (ooru peru bhairavakona ott release date) అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందంతో పాటు, ప్రైమ్‌ వీడియో కూడా సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. సందీప్‌ కిషన్‌ నటన, కథలోని ట్విస్ట్‌లు, ముఖ్యంగా విరామ సన్నివేశాలు ఈ సినిమాను నిలబెట్టాయి. నిడివి కూడా సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. వీఐ ఆనంద్ తనదైన శైలిలో మూవీని తీర్చిదిద్దడంలో మంచి మార్కులు కొట్టేశారు.

కథేంటంటే: భైరవకోన ఓ మార్మిక ప్రపంచం. ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలో రాత్రి వేళ మాత్రమే ఆ ఊరి తలుపులు తెరచుకుంటుంటాయి. అందులోకి ప్రవేశించిన వాళ్లే తప్ప.. ప్రాణాలతో బయటకొచ్చిన వాళ్లు ఎవరూ ఉండరు. ఓరోజు రాత్రి పెళ్లిలో దొంగతనం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ అలియాస్‌ బసవ లింగం (సందీప్‌ కిషన్‌).. తన ఫ్రెండ్‌ జాన్‌ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్‌)తో పాటుగా ఆ ఊరిలోకి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? భైరవకోనలో బసవకు ఎలాంటి పరిస్థితులెదురయ్యాయి? అసలు ఆ కోన కథేంటి? దానికి గరుడపురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు ఉన్న లింకేంటి? స్టంట్‌మ్యాన్‌ బసవ తనకు అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ) కోసం దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? భైరవకోన నుంచి బసవ గ్యాంగ్‌ ప్రాణాలతో బయటపడిందా?  లేదా? అన్నది మిగిలిన కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని