ott movies telugu: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

2023లో మరో నెల చివరకు వచ్చేసింది. ఇటీవల దసరాకు విడుదలైన సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తుండగా, పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి?

Published : 26 Oct 2023 14:57 IST

ఛాంగురే బంగారురాజా

కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా హీరో రవితేజ నిర్మించిన చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. సతీష్‌ వర్మ తెరకెక్కించారు. సత్య, రవిబాబు, నిత్యశ్రీ, ఎస్తర్‌ నోరోన్హా కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ వేదికగా అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


జయం రవి.. నయన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌..

జయం రవి, నయనతార కీలక పాత్రల్లో ఐ.అహ్మద్‌ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇరైవన్‌’. తెలుగులో ‘గాడ్‌’ (God Movie ott Relase) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గురువారం (అక్టోబరు 26) నుంచి (iraivan ott release date) నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


థియేటర్‌లో అలరించలేదు.. మరి ఓటీటీలో

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ కీలక పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన హారర్‌ చిత్రం ‘చంద్రముఖి-2’. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘చంద్రముఖి2’ అందుబాటులో ఉంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లివే!

  • నెట్‌ఫ్లిక్స్‌
  • పెయిన్‌ హజ్లర్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 27
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ఆస్పిరెంట్స్‌ (హిందీ సిరీస్‌2) అక్టోబరు 25
  • ట్రాన్స్‌ఫార్మార్స్‌ (హాలీవుడ్) అక్టోబరు 26
  • కాన్‌సిక్రేషన్‌ (హాలీవుడ్) అక్టోబరు 27
  • కాస్టావే దివా (కొరియన్‌) అక్టోబరు 28
  • జీ5
  • దురంగా (వెబ్‌సిరీస్‌2) అక్టోబరు 24
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మాస్టర్‌ పీస్‌ (మలయాళం/తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది
  • ఆహా
  • కృష్ణగాడు అంటే ఓ రేంజ్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • కేస్‌ 30 (తెలుగు) అక్టోబరు 27
  • సురాపానం (తెలుగు) అక్టోబరు 27
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని