Ori devuda: ‘ఓరి దేవుడా..!’లో వెంకటేష్ కాకుండా మరొకరైతే బాగుండేది..!
‘ఓరి దేవుడా..!’ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో విశ్లేషించారు.
ఇంటర్నెట్ డెస్క్: విశ్వక్‌సేన్ హీరోగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఓరి దేవుడా..!’. వెంకటేష్ అతిథి పాత్రలో అలరించిన ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి తెలుగు రీమేక్‌గా ‘ఓరి దేవుడా’ తెరకెక్కిన విషయం తెలిసిందే. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ చేశారు. సినిమాలకు ఇలాంటి టైటిల్ పెట్టడం సాహసమని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా స్క్రీన్‌ప్లే రూపొందించడం కష్టమని.. అందులో ఏమైనా తప్పులు దొర్లితే కనెక్టివిటీ కోల్పోతారన్నారు. ఈ చిత్రంలో అలాంటి తప్పులు వచ్చాయమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన చిత్రమన్నారు.
ఈ చిత్రం చిన్ననాటి స్నేహితుల మధ్య నడిచిన అద్భుతమైన ప్రేమకథ అని పరుచూరి చెప్పారు. ఈరోజుల్లో ఎటువంటి లవ్‌స్టోరీని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. అయితే, డైలాగ్స్ విషయంలో కొంచెం గందరగోళానికి గురైనట్లు అనిపించిందన్నారు. ఓరి దేవుడాలో వెంకటేష్ పాత్ర విచిత్రంగా ఉందన్నారు. ఆయన దేవుడా? లేదంటే దేవుడి ప్రతినిధా?అని చెప్పడంలో స్పష్టత లోపించిదన్నారు. సాధారణ భార్యభర్తల మధ్య అనుమానాలు సినిమాగా చూపించకుండా మధ్యలోకి ప్రేమకథను తీసుకువచ్చారని చెప్పారు. సినిమా మధ్యలో కొన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. క్లైమాక్స్ థ్రిల్లింగ్ ఉందన్నారు. కొందరు భార్యభర్తలు విడిపోవాలని లేకున్నా కోర్టుకు వస్తున్నారని ఈ సినిమా ద్వారా చెప్పారన్నారు.
ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ పెట్టకుండా మరేదైనా పెడితే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్క్రీన్‌ప్లేలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందన్నారు. సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే విధంగా స్క్రీన్‌ప్లే రచించుకోవాలన్నారు. వెంకటేష్ అతిథి పాత్ర వేయకుండా ఉంటే బాగుండేదన్నారు. ఆయన కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులు నిరాశకు గరైయ్యారని చెప్పారు. ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుని తన స్థాయికంటే తక్కువ చూపిస్తే ప్రమాదమని అన్నారు. కామెడీ చెయ్యాలంటే రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలు చాలామంది ఉన్నారని ఇలాంటి పాత్రల్లో వాళ్లని పెట్టాలన్నారు. హీరోయిన్ చాలా బాగా చేసిందని ప్రశంసించారు. ఓరి దేవుడా అనే ఈ సినిమా అద్భుతమైన ప్రేమకథగా ఆకాశం అంచుల దాకా వెళ్లాల్సిన సినిమా అని మధ్యలోనే ఆగిపోయిందేమో అని అన్నారు. వసూళ్ల పరంగా సక్సెస్ అయిందో లేదో తెలీదని చెప్పారు. మంచి ప్రయత్నమని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: లైంగిక వాంఛ తీర్చాలని అర్ధరాత్రి వేధింపులు.. కత్తితో పొడిచి చంపిన యువతి
-
India News
పండగ వేళ విషాదం.. ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు
-
General News
Sri Rama Navami: భద్రాచలంలో వైభవంగా రాములోరి కల్యాణోత్సవం
-
India News
Shashi Tharoor: నిర్మలాజీ.. మీరు గ్రేట్.. ఆ పాప కోసం రూ. ఏడు లక్షలు వదిలేశారు!
-
Crime News
Tanuku: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. దగ్ధమైన చలువ పందిరి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు