పృథ్వీరాజ్‌ సుకుమారన్‌పై ప్రశంలు కురిపించిన హీరో ప్రభాస్‌

టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ ‘దిగోట్ లైఫ్‌’పై ప్రశంలు కురిపించారు.

Published : 10 Mar 2024 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’ చిత్రంలో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran).  బ్లెస్సీ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’ (The goat life). మలయాళంలో ‘ఆడు జీవితం’ పేరుతో తెరకెక్కింది. గోట్‌ డేస్‌ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ కథానాయిక.  మార్చి 28న తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.  ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. తాజాగా దీనిపై టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) పృథ్వీరాజ్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌ పెట్టారు. గతంలో ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ని ప్రభాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

‘‘ నేను చూస్తుంది వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తినా! ఇది నేను నమ్మలేకపోతున్నా. పృథ్వీ మీరు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. మంచి విజయం సాధిస్తుంది. మీకు అభినందనలు’’ అని ప్రభాస్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. బదులుగా పృథ్వీరాజ్‌ ‘‘ధన్యవాదాలు దేవా. త్వరలో యుద్ధభూమిలో కలుద్దాం’’అని రిప్లై ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని