Prabhas: ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌.. మారుతితో సినిమా టైటిల్ అదిరింది!

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ని ప్రకటించి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

Published : 15 Jan 2024 07:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అభిమానులకు ప్రముఖ నటుడు ప్రభాస్‌ (Prabhas) సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సంక్రాంతి పండగ జోష్‌ను రెట్టింపు చేశారు. ఈయన హీరోగా దర్శకుడు మారుతి (maruthi) ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ (prabhas maruthi movie first look) అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ‘రాజా సాబ్‌’ (Raja Saab) అనే పేరును (prabhas maruthi movie title) ఖరారు చేశారు. సోషల్‌ మీడియాలో విడుదల చేయకముందు పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరం (భీమవరం సమీపంలో)లో ఏర్పాటు చేసిన ‘వెంప కాశీ కోడి పందెం బరి’లో భారీ ఎల్‌ఈడీ తెరపై ప్రభాస్‌ డిజిటల్‌ లుక్‌ను ప్రదర్శించారు. ఇలా చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అని చిత్ర బృందం పేర్కొంది. ప్రభాస్‌ కటౌట్‌ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హీరో వింటేజ్‌ లుక్‌కు ఫిదా అయ్యారు.

ప్రభాస్‌ మొహమాటం.. రాజమౌళికి తిట్లు..

ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ సినిమాని గతేడాది ప్రారంభించారు. ఈ కాంబినేషన్‌పై ఇంతకాలం అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం. ఈ క్రమంలో.. సినిమా నేపథ్యం, టైటిల్‌పై పలు రూమర్స్‌ వచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్‌ కూడా వినిపించింది. కథానాయికల వివరాలను గోప్యంగానే ఉంచారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘సలార్‌’తో విజయోత్సాహంలో ఉన్న ప్రభాస్‌ ఈ కొత్త సినిమాతోపాటు ‘కల్కి 2898 ఏడీ’ (Kaliki 2898 AD)లోనూ నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని