Salaar: నేను ఖాన్సార్‌ భవిష్యత్తును నిర్ణయిస్తా.. మీరు వేడుక చేసుకోండి: ప్రభాస్‌

‘సలార్‌’ (Salaar) విజయంపై ప్రభాస్‌ మాట్లాడారు. సినిమాను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Published : 01 Jan 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్లాక్‌ బస్టర్‌ విజయంతో ‘సలార్‌’ (Salaar) గతేడాదికి వీడ్కోలు పలికింది. 2023 చివర్లో విడుదలైన ఈ చిత్రం యాక్షన్‌ ప్రియులను మెప్పించి.. భారీ వసూళ్లు సొంతం చేసుకుంటోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్‌కు చాలా రోజుల తర్వాత విజయాన్ని అందించడంతో అభిమానులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ విజయంపై తాజాగా ప్రభాస్‌ (Prabhas) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘సలార్‌’పై మీరంతా చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను కొనసాగించడం మా టీమ్‌ అందరికీ మీరిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించారు. అందుకే ఇంత గొప్ప అవుట్‌పుట్‌ వచ్చింది. ప్రేక్షకులంతా దీన్ని ప్రశంసిస్తుంటే.. మా అందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇక న్యూ ఇయర్‌ విషెస్‌ కూడా ప్రభాస్‌ కొత్తగా చెప్పారు. ‘‘నేను ఖాన్సార్‌ భవిష్యత్తును నిర్ణయిస్తాను. మీరంతా కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా చేసుకోండి. ‘సలార్‌’ను ఆదరించినందుకు ధన్యవాదాలు’’ అని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. సోషల్ మీడియాలో తక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ చేయడంతో దాన్ని అందరూ షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం అభిమానులంతా దీని పార్ట్‌2 కోసం ఎదురుచూస్తున్నారు. ‘సలార్‌:సీజ్‌ఫైర్‌’లోనే  రెండో భాగానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది. ‘సలార్‌’ విజయంపై టీమ్ సభ్యులు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా రెండో పార్ట్‌ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని