prasanth varma: హోటల్‌ సిబ్బందిని సర్‌ప్రైజ్‌ చేసిన హనుమాన్‌ విలన్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో

‘హనుమాన్‌’ విలన్‌ వినయ్‌రాయ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ వీడియోను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated : 06 Mar 2024 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ప్రశాంత్‌ వర్మ(prasanth varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’(HanuMan). సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అమృత అయ్యర్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని కీలకపాత్రల్లో నటించారు.  బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సినిమాలో వినయ్‌రాయ్‌ ‘మైఖేల్‌’ పాత్రలో నటించి మెప్పించారు.  తాజాగా ఆయన ఆఫ్‌ స్క్రీన్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను సూపర్ విలన్‌ మైఖేల్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మాస్క్‌ కలిగిన బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేశారు వినయ్‌రాయ్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇటీవల హనుమాన్‌ 50 డేస్‌ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్‌వర్మ సీక్వెల్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘జై హనుమాన్‌’కు సంబంధించిన పని మొదలైంది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తాం. ఇందులో హనుమంతుడే హీరో. ఈ సినిమా ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌ సన్నివేశంలా రెండున్నర గంటల పాటు అదే థ్రిల్‌, జోష్‌తో ఉంటుంది. కచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా తీస్తా. ఈ విజయాన్ని బాధ్యతగా తీసుకుని, ‘జై హనుమాన్‌’ను తీర్చిదిద్దుతా’’అని ప్రశాంత్‌వర్మ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని