Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 18 Mar 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’లో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran). ఆయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’ (Aadujeevitham). బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమలపాల్‌ కథానాయిక. ‘దిగోట్‌ లైఫ్‌’ పేరుతో ఇంగ్లీష్‌లోను విడుదల కానుంది. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

‘‘ఈ సినిమాలో నేను నజీబ్‌ అనే బానిస పాత్ర పోషించాను. దానికోసం 31 కిలోలు బరువు తగ్గాను. జిమ్‌ ట్రైనర్‌, పోషకాహార నిపుణులు, డాక్టర్స్‌ పర్యవేక్షణలో ఇది సాధ్యమైంది. వారు నన్ను విశ్రాంతి తీసుకోమని సూచించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్‌లో ఉండాల్సి వచ్చేది. కరోనా లాక్‌డౌన్‌తో చిత్రబృందం ఇబ్బందులు ఎదుర్కొంది.  పశ్చిమాసియాలోని జోర్డాన్‌ ప్రాతంలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటించారు. మూడు నెలలు జోర్డాన్‌ రాయల్‌ ఫిల్మ్‌ కమిషన్‌ మమ్మల్ని ఆదరించింది. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం. ఈ విషయాలను తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనిపింది. అందుకే చెప్పాను’’ అని పృథ్వీరాజ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని