Raakshasa Kaavyam Ott: ఓటీటీలో రాక్షస కావ్యం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Raakshasa Kaavyam: అభయ్‌ నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌ కీలక పాత్రల్లో నటించిన ‘రాక్షస కావ్యం’ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Published : 11 Dec 2023 18:47 IST

హైదరాబాద్‌: అభయ్‌ నవీన్‌, కుశాలిని, అన్వేష్‌ మైఖేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam). శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మించారు. మైథాలజీని, నేటి సామాజిక పరిస్థితులను అన్వయించి రూపొందించిన ఈ సినిమాలో , పవన్‌ రమేష్‌, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ (Raakshasa Kaavyam ott release date) కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇంతకీ కథేంటంటే: అజయ్‌ (అభయ్‌ బేతగంటి) ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌. చదువుకున్న వాళ్లంటే అతనికి గౌరవం. మరోపక్క విజయ్‌(అన్వేష్‌ మైఖేల్‌)కి సినిమాల పిచ్చి. హీరోల కంటే విలన్లు అంటేనే ఎక్కువ ఇష్టం. విలన్లకు న్యాయం చేయడానికి తనే ఓ సినిమా తీయాలని ప్రయత్నిస్తాడు. చెడులో మంచిని చూడగలగడం అజయ్ వ్యక్తిత్వమైతే.. మంచి మీద చెడు గెలవాలి అనుకోవడం విజయ్ క్యారెక్టర్. ఈ క్రమంలో అజయ్‌ను చంపడానికి విజయ్‌ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు అజయ్‌, విజయ్‌లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజయ్‌ తల్లి ఎలా చనిపోయింది? హత్యలు, సెటిల్‌మెంట్స్‌ చేస్తూ సంపాదించిన డబ్బును అజయ్‌ ఏం చేశాడు? సొంత తండ్రిని ఎందుకు దూరం పెట్టాడు? అజయ్‌, విజయ్‌ల కథ ఏంటి అనేది తెలియాలంటే రాక్షస కావ్యం చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని