Rajamouli: ‘ప్రేమలు’ టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు

‘ప్రేమలు’ (Premalu) చిత్రబృందంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తనకు నచ్చిందన్నారు.

Published : 08 Mar 2024 20:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నస్లేన్ కె.గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమిత బైజు, శ్యామ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ.డి. తెరకెక్కించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’ (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన దీనిని ఉద్దేశించి రాజమౌళి ట్వీట్‌ చేశారు. సినిమా తనకెంతో నచ్చిందన్నారు. ‘‘ప్రేమలు చిత్రాన్ని కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేసినందుకు సంతోషిస్తున్నా. సినిమా ఆద్యంతం నవ్వులు పంచింది. మీమ్‌\యూత్‌ లాంగ్వేజ్‌ను ప్రేక్షకులకు చక్కగా అందించేందుకు రచయిత అద్భుతంగా పని చేశారు. ట్రైలర్‌ చూసినప్పుడే రేణు పాత్ర నాకెంతో నచ్చేసింది. సినిమా చూశాక సచిన్‌ కూడా నచ్చేశాడు. ఏది ఏమైనా నా ఫేవరెట్‌ మాత్రం ఆదినే (జస్ట్‌ కిడింగ్‌)’’ అని ట్వీట్‌ చేశారు.

తమ చిత్రానికి వస్తోన్న స్పందనను దృష్టిలో ఉంచుకుని కార్తికేయ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ‘‘ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రం గురించి నాకు తెలిసింది. అక్కడి నిర్మాతలను సంప్రదించి.. తెలుగులో దీనిని విడుదల చేయాలనుకుంటున్నానని చెప్పా. వారు నాకెంతో సహకరించారు. ఏడెనిమిది రోజుల్లోనే డైలాగ్స్‌ రాసి తెలుగు డబ్బింగ్‌ పూర్తి చేయించాం. కుటుంబంతో కలిసి చూసే ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది’’ అని అన్నారు. మలయాళంలో మాదిరిగానే తెలుగులోనూ ఇది ఘన విజయాన్ని అందుకుంటుందని నిర్మాత, చిత్ర నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని