
Ram Pothineni: ‘వారియర్’గా రాబోతున్నరామ్!
టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం
హైదరాబాద్: కథానాయకుడు రామ్ పోతినేని నటించిన గత రెండు చిత్రాలు.. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ మాస్ సినిమాలుగా మంచి పేరు తీసుకొచ్చాయి. అదే జోరుతో కోలీవుడ్ సంచలన దర్శకుడు లింగుస్వామితో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి తాజాగా ‘ది వారియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌తోపాటు రామ్ పోతినేని ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్.. పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి, అక్షర గౌడ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.