The Warriorr: వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి..: ది వారియర్‌ టీజర్‌ చూశారా?

మైడియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్‌ వార్నింగ్‌’ అంటున్నారు యువ కథానాయకుడు రామ్‌

Updated : 07 Dec 2022 16:18 IST

హైదరాబాద్‌: ‘మై డియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్‌ వార్నింగ్‌’ అంటున్నారు యువ కథానాయకుడు రామ్‌(Ram). లింగు స్వామి దర్శకత్వంలో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’(The Warriorr). ఆదివారం రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు చిత్ర బృందం కానుక ఇచ్చింది. ‘ది వారియర్‌’ను టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రామ్‌ ఇంతకుముందెన్నడూ చేయని ఫుల్‌ మాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించారు. రామ్‌కు దీటుగా ఆది ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్జే విజిల్‌ మహాలక్ష్మి పాత్రలో కృతిశెట్టి(Krithi Shetty) నటిస్తోంది. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని