Published : 07 Apr 2022 16:15 IST

Rashmika: విజయ్‌తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ సరసన రష్మిక మందన నటిస్తున్న చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంది. విజయ్‌తో నటించడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. విజయ్‌తో కలిసి నటించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయంటూ ట్వీట్‌లో పేర్కొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి పీవీపీ బ్యానర్‌పై సంయుక్తంగా సమర్పిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని