Rashmika: కొరియన్‌, థాయ్‌లాండ్‌ స్టార్‌లతో రష్మిక సందడి.. ఎక్కడంటే?

సౌత్‌ కొరియన్‌, థాయ్‌లాండ్‌కు చెందిన నటులతో రష్మిక సందడి చేశారు. వారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Published : 23 Feb 2023 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన హావభావాలతో యువతకు గిలిగింతలు పెట్టి నేషనల్‌ క్రష్‌గా పేరొందిన నటి రష్మిక (Rashmika Mandanna). ఫ్యాషన్‌పై అమితాసక్తి చూపే ఆమె ఇటలీలోని మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ప్రసిద్ధిగాంచిన ఆ ఫ్యాషన్‌ వీక్‌లో పలు దేశాలకు చెందిన నటులు పాల్గొంటుంటారనే విషయం తెలిసిందే. అలా అక్కడకు వెళ్లిన సౌత్‌ కొరియన్‌ నటుడు జంగ్‌ ఊ, థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు గల్ఫ్‌ కానావుత్‌తో కలిసి రష్మిక సందడి చేశారు. వారితో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు. ఈ స్టిల్స్‌ను కొందరు ట్విటర్‌లో పెట్టగా అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘క్యూట్‌’, ‘గ్రేట్‌’, ‘వావ్‌’ అంటూ రష్మిక అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘ది వరల్డ్‌ ఆఫ్‌ సైలెన్స్‌’, ‘మై లవ్‌’, ‘ది రైజ్‌ ఆఫ్‌ టామ్‌బాయ్‌’ తదితర చిత్రాలు, ‘హై-ఎండ్‌ క్రష్‌’ వెబ్‌ సిరీస్‌తో జంగ్‌, ‘వై ఆర్‌ యు’ తదితర సిరీస్‌లు, పలు టెలివిజన్‌ షోలతో గల్ఫ్‌ మంచి గుర్తింపు పొందారు.ఈ సంక్రాంతికి విడుదలైన ‘వారసుడు’ (Vaarasudu) సినిమాతో ప్రేక్షకులను అలరించిన రష్మిక తర్వాత ‘మిషన్‌ మజ్ను’తో సందడి చేశారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ‘యానిమల్‌’ (Animal), అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని