Alluri: తెరపైకి మరో ‘అల్లూరి’.. పరిచయం చేసిన రవితేజ!

శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు ప్రదీప్‌ వర్మ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నటుడు రవితేజ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 05 Apr 2022 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ పోషించిన అల్లూరి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అంతగా ఆయా పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడిదే పేరుతో (అల్లూరి) మరో చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు ప్రదీప్‌ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను నటుడు రవితేజ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో విష్ణు పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని గొప్ప పోలీసు అధికారి కథను ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నట్టు పోస్టర్‌లో రాసి ఉంది. మరి ఆయన ఎవరో, ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభంకానుంది. హర్ష వర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తుండగా రాజ్‌ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని