Rocky aur rani ki prem kahani: ఓటీటీలోకి ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’.. వామ్మో అంత రెంటా?

రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), అలియా భట్‌ (Aliabhatt) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky aur rani ki prem kahani). తాజాగా ఇది ఓటీటీలోకి అడుగుపెట్టింది.

Updated : 08 Sep 2023 15:02 IST

ముంబయి: బాలీవుడ్‌ నటీనటులు అలియాభట్‌ (Alia Bhatt), రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ప్రధాన పాత్రల్లో నటించిన కొత్తతరం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani). చాలా ఏళ్ల విరామం తర్వాత దర్శకుడు కరణ్‌జోహార్‌ (Karan Johar) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కాగా, ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ.349 చెల్లించాల్సి ఉంటుంది.

మరోసారి ‘అన్నమయ్య’ తీద్దామనుకుంటే ‘శిరిడిసాయి’ పట్టాలెక్కింది!

కథేంటంటే: దిల్లీలో స్వీట్స్‌ వ్యాపారం చేసే పంజాబీ కుటుంబానికి చెందిన వారసుడు రాకీ రాంధ్వా (రణ్‌వీర్‌ సింగ్‌). అతడికి కన్వల్ (ధర్మేంద్ర), ధనలక్ష్మి (జయబచ్చన్) అనే తాత, అమ్మమ్మలు ఉంటారు. కన్వల్‌.. తన స్నేహితురాలు జామిని ఛటర్జీ (షబానా అజ్మీ) అనే మహిళను కలవాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. వాళ్లిద్దరినీ కలిపేందుకు రాకీ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే అతడు జామిని మనవరాలు రాణీ (అలియాభట్‌)తో ప్రేమలో పడతాడు. రాకీ - రాణీ ప్రేమకు ఇరు కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. మరి, వీరి ప్రేమ కథ విజయం అందుకుందా? ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపేందుకు రాణీ ఏం చేసింది? కన్వల్‌ - ధనలక్ష్మి - జామిని ఛటర్జీ కథ ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని