RRR: 300 రోజులు.. 3000 మంది సాంకేతిక నిపుణులు.. ‘ఆర్ఆర్ఆర్’ షూట్ జర్నీ
క్రేజీ మల్టీస్టారర్, పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకలోకంతోపాటు చిత్రపరిశ్రమ ఎదురుచూస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రేజీ మల్టీస్టారర్, పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తి నెలకొన్న ఈ సినిమా చిత్రీకరణ ఎక్కడ సాగింది? ఎన్ని రోజుల్లో పూర్తయింది? ఎంతమంది పనిచేశారు? తెలుసుకుందామా...
- సినిమా బడ్జెట్: సుమారు రూ.500 కోట్లు.
- సాంకేతిక నిపుణుల సంఖ్య: 3000.
- ఈ చిత్రంలో భాగస్వాములైన కో డైరెక్టర్ల సంఖ్య: 9.
- చిత్రీకరణ సమయం: 300 రోజులకుపైగా.
- చిత్రీకరణకు ముందు రిహార్సల్ చేసిన సమయం: 200 రోజులు.
- షూటింగ్ పూర్తి చేసేందుకు ముందుగా అనుకున్న సమయం: 240 రోజులు. తర్వాత, మరో 60 రోజుల వ్యవధి పెంచారు.
- యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయం: 75 రోజులు. లండన్‌కు చెందిన 2500, అబ్రాడ్‌కు చెందిన 40 మంది ఫైటర్లు
- నైట్ షూట్ (రాత్రివేళ చిత్రీకరణ): 25 నుంచి 28 రాత్రుళ్లు షూట్ చేయాలనుకున్నారు. కానీ, 60 రాత్రుళ్లు పట్టింది.
- చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు: హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, వికారాబాద్, గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్, ఉక్రెయిన్.
- రాజమౌళి తనయుడు కార్తికేయ స్నేహితుడికి చెందిన 10 ఎకరాల స్థలంలో (గండిపేట సమీపంలో) దిల్లీ సెట్ వేశారు.
- రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ పరిచయ సన్నివేశం, పతాక సన్నివేశం (క్లైమాక్స్) చిత్రీకరించారు. బల్గేరియాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం, పులితో పోరాడే సన్నివేశం తెరకెక్కించారు. ఉక్రెయిన్‌లోని ‘రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్’ లో ‘నాటు నాటు’ పాటను షూట్ చేశారు.
- ఈ పాట కోసం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తోపాటు ఓ స్టంట్ కొరియోగ్రాఫర్ పనిచేశారు. ఎమోషన్‌తో కూడిన మాస్ బీట్ ఇది.
- ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశానికి సంబంధించిన సీజీ (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజనరీ) వర్క్ లండన్‌లోని ప్రఖ్యాత సంస్థ ఎంపీసీ (మూవింగ్ పిక్చర్ కంపెనీ)లో జరిగింది. ‘ది లయన్ కింగ్’ వంటి ఎన్నో హాలీవుడ్ చిత్రాల సీజీ పనులు అక్కడే పూర్తయ్యాయి.
- నటీనటుల పారితోషకాలు, మార్కెటింగ్, ప్రచార బాధ్యతలు రాజమౌళి తనయుడు కార్తికేయ; ఏ రోజు ఏ సీన్ షూట్ చేయాలి, నిర్మాణాంతర కార్యక్రమాలు సహా విడుదలకు సంబంధించిన వ్యవహారాలు రాజమౌళి వదిన, కీరవాణి సతీమణి శ్రీవల్లి చూసుకున్నారు.
- రాజమౌళి గతంలో తెరకెక్కించిన పలు సినిమాల చిత్రీకరణ సమయ వివరాలివీ.. ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి 600 రోజులు. ‘ఈగ’: 180 రోజులు, ‘మర్యాద రామన్న’: 120 రోజులు, ‘ఛత్రపతి’: 140 రోజులు.
ఈ విశేషాలపై దర్శకుడు సందీప్ వంగా- రాజమౌళి ప్రత్యేక ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు