RRR Movie Review: రివ్యూ: ఆర్ఆర్ఆర్
RRR Review: ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎలా ఉందంటే?
చిత్రం: ఆర్ఆర్ఆర్; నటీనటులు: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్‌దేవ్‌గణ్, అలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, రేస్టీవెన్ సన్, శ్రియ తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; కథ: కె.వి.విజయేంద్ర ప్రసాద్; సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా; నిర్మాత: డీవీవీ దానయ్య; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి; బ్యానర్: డీవీవీ ఎంటర్టైన్మెంట్; విడుదల: 25-03-2022
స్టార్ హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కనిపించే సందడే వేరు. అదే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తే, ఆ సినిమాను కెరీర్లోనే అపజయం ఎరుగని దర్శకుడు తెరకెక్కిస్తే అది ‘RRR’ అవుతుంది. ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram charan) కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రౌద్రం రణం రుధిరం-ఆర్ఆర్ఆర్’(RRR). అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో మొదలైన ఈ చిత్రం కరోనాలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పోరాట యోధుల పాత్రల్లో ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) ఎలా కనిపించారు? బ్రిటిష్ వారిపై ఎలాంటి పోరాటం చేశారు?ఇద్దరు స్టార్ హీరోలను దర్శకుడు రాజమౌళి ఏ విధంగా చూపించారు?ఈ కథలో అలియా భట్, అజయ్‌దేవగణ్, శ్రియ తదితరుల పాత్రలు ఏంటి?(RRR Movie Review)
కథేంటంటే: 1920 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్‌చరణ్)(Ram charan) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. పై అధికారుల మెప్పు పొంది పదోన్నతి పొందాలనేదే అతని ఆశయం. తన మరదలు సీత (అలియాభట్)కి ఇచ్చిన మాట నెరవేరాలంటే ఆ లక్ష్యం సాధించాల్సిందే. మరోవైపు బ్రిటిష్ గవర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్సన్) తన కుటుంబంతోపాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, అక్కడ గోండు జాతికి చెందిన మల్లి అనే చిన్నారిని వాళ్లతోపాటే దిల్లీకి తీసుకెళతారు. ఇది అన్యాయమని ఎదిరించిన కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాపరిలాంటి భీమ్ (ఎన్టీఆర్)(NTR) మల్లిని తీసుకు రావడం కోసం దిల్లీకి పయనమవుతాడు. మరి శత్రుదుర్భేద్యమైన బ్రిటిష్ కోటని భీమ్ దాటుకుని వెళ్లగలిగాడా?అక్కడే పోలీస్ అధికారిగా పనిచేస్తున్న రామరాజుకీ, భీమ్‌కీ మధ్య ఏం జరిగింది? ఆ ఇద్దరికీ భారత స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం ఏంటి?(RRR Movie Review) తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కథలో భావోద్వేగాల్ని పండించడంలో మాస్టర్ రాజమౌళి(Rajamouli). ఆయన సినిమా అంటే భావోద్వేగాలతో పాటు, తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్‌నెస్ కూడా. ఆ రెండు విషయాల్లో తనదైన ప్రభావం చూపించి తాను ‘మాస్టర్ కెప్టెన్’ అని మరోసారి చాటారు. ఆయనకి ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan)లాంటి మంచి నటులు కూడా తోడయ్యారు. వాళ్ల అభినయం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి. (RRR Review)పాటలు, పోరాట ఘట్టాలు... ఇలా భావోద్వేగాలు పండించడానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా ప్రతీ సందర్భాన్నీ వాడుకున్నారు రాజమౌళి(Rajamouli). నిప్పు, నీరు... అంటూ రెండు శక్తుల్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించారు దర్శకుడు. ఆ శక్తులకి తగ్గట్టే ఉంటాయి పరిచయ సన్నివేశాలు. రామ్‌చరణ్‌ని భారీదనంతో కూడిన, అత్యంత సహజమైన లాఠీఛార్జ్ యాక్షన్ ఘట్టంతో పరిచయం చేసిన విధానం, అందులో ఆయన నటించిన తీరు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పులితో కలిసి చేసే విన్యాసాలతో కథలోకి ఎంట్రీ ఇస్తారు. ఇక అక్కడ్నుంచి ఆ రెండు పాత్రలూ ప్రేక్షకుల సొంతమైపోతాయి. ఇద్దరినీ కలిపే ఓ సంఘటన, వాళ్ల దోస్తీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయి.(RRR Review) అక్కడ్నుంచి కథలో ‘బ్రొమాన్స్’ మొదలవుతుంది. భీమ్ అమాయకత్వం, రామ్‌చరణ్ అతనికి సాయం చేసే తీరు ఆకట్టుకుంటుంది. నాటు నాటు పాటలో కూడా హృదయాల్ని హత్తుకునేలా ఎమోషన్స్ పండించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురించినట్టుగానే, వైరం కూడా మొదలవుతుంది. రెండు శక్తులు ఒకదానికొకటి తలపడితే అది ఎంత భీకరంగా ఉంటుందో చూపిస్తూ రామరాజు, భీమ్ మధ్య సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. (RRR Review)రామ్‌చరణ్, ఎన్టీఆర్... ఇద్దరూ పోటీపడి నటించారు. ముఖ్యంగా భీమ్ ఆ పోరాటం కోసం రంగంలోకి దిగే తీరు అద్భుతం అనిపిస్తుంది.
ద్వితీయార్ధం ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. అజయ్ దేవగణ్, శ్రియ తదితరుల నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలు అక్కడక్కడా కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కానీ, అజయ్ దేవగణ్, శ్రియ పాత్రల పరిధి తక్కువే అయినా వాళ్లు సినిమాపై చక్కటి ప్రభావం చూపిస్తారు. (RRR Review) భీమ్‌కి శిక్ష విధించే సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. కొమురం భీముడో... అంటూ ఎన్టీఆర్ నేపథ్యంలో వచ్చే పాట, ఆ క్రమంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఓ గిరిజన బాలికని కాపాడే అంశంతో ముడిపెడుతూ ఇద్దరి మధ్య స్నేహ బంధాన్ని, వాళ్ల పోరాటాల్ని ఆవిష్కరించే కథ ఇది. (RRR Review) సీత పాత్ర కథలో మలుపునకు కారణమవుతుంది. పతాక సన్నివేశాలకి ముందు ఇద్దరు కథానాయకులు ఒకటయ్యే తీరు అలరిస్తుంది. ఒకరు అల్లూరి సీతారామరాజు, మరొకరు కొమరం భీమ్‌ని పోలినట్టుగా కనిపిస్తూ శత్రుదుర్బేధ్యమైన బ్రిటిష్ కోటపై పోరాటం చేసే తీరు మెప్పిస్తుంది. ద్వితీయార్ధం మొదలయ్యాక వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, చిన్నారిని రక్షించే సన్నివేశాలతోనే కథంతా పూర్తవుతుంది. ఆ తర్వాత అంతా పోరాటమే. కథ కంటే కూడా దర్శకుడు దాన్ని భావోద్వేగాలతో పట్టు సడలకుండా నడిపిన తీరే సినిమాకి హైలైట్‌గా నిలిచింది.(RRR Review) నీరు, నిప్పు అంటూ పాత్రల్ని పరిచయం చేశారు. అయితే, నటన పరంగా చూస్తే ఇద్దరూ నిప్పు కణికల్లాగే కనిపిస్తారు.
ఎవరెలా చేశారంటే: ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం దర్శకుడు రాజమౌళికి దొరికిన నిజమైన రెండు శక్తులు ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ramcharan). ఆయన మొదలు పెట్టిన ‘RRR’ యుద్ధాన్ని వెదుక్కుంటూ వచ్చిన రెండు పదునైన ఆయుధాల్లాగే మారిపోయారు. వాళ్ల మధ్య స్నేహం తెరపై చూడముచ్చటగా ఉంది. వాళ్లు పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘట్టాల్లో అభినయం చాలా బాగుంది. ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి సింక్‌లో డ్యాన్స్ చేసిన తీరు చూస్తూ కళ్లు తిప్పుకోలేం. అలియాభట్, అజయ్ దేవగణ్ సినిమాకి కీలకం. శ్రియ చిన్న పాత్రలో మెరిశారు. భీమ్ అంటే ప్రేమభావం కలిగిన బ్రిటిష్ యువతిగా ఓలివియా మోరిస్ కనిపిస్తుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు చక్కటి అభినయం ప్రదర్శించారు.
సాంకేతికంగా.. సినిమా ఉన్నతంగా ఉంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం నేపథ్య సంగీతం, పాటలు సినిమాకి ప్రధానబలం.(RRR Review) సెంథిల్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్ లుక్‌లో చూపించారు. రాజమౌళి కన్న కలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకు శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఇక బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్. సెట్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. పాత్రల కోసం రమా రాజమౌళి ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్ ఆ పాత్రలను తెరపై మరింత సహజంగా కనిపించేలా చేశాయి. సాల్మన్ పోరాట ఘట్టాల కొరియోగ్రఫీ బాగుంది. నాటు పాటలో నృత్యరీతులు అలరిస్తాయి. సీత కనిపించిందా? అని అడిగితే ‘కాదు, కళ్లు తెరిపించింది’ తరహా సంభాషణలతో (RRR Review) బుర్రా సాయిమాధవ్ మాటల మెరుపు చాలా చోట్ల కనిపిస్తుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ముడిపెడుతూ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథని అల్లిన తీరు మెప్పిస్తుంది. దర్శకుడు రాజమౌళి మరోసారి తన పర్ఫెక్షనిజాన్ని ప్రదర్శిస్తూ... ప్రేక్షకులు ఎక్కడ ఏం కోరుకుంటారో అవన్నీ పక్కాగా జోడిస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణం పరంగా హంగులు అడుగడుగునా కనిపిస్తాయి.
బలాలు
+ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన
+ కథలోని భావోద్వేగాలు... పోరాట ఘట్టాలు
+ రాజమౌళి మార్క్ విజువల్ గ్రాండ్‌నెస్
+ కీరవాణి సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల కాస్త సాగదీతగా అనిపించే సన్నివేశాలు
చివరిగా: ‘ఆర్ఆర్ఆర్’..: బాక్సాఫీస్ కుంభస్థలంపై గురిపెట్టిన రాజమౌళి అస్త్రం(RRR Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్‌పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ