Sai Dharam Tej: పేరు మార్చుకున్న సాయి ధరమ్‌ తేజ్‌.. కొత్తగా ఏం యాడ్‌ చేశారంటే?

సాయి ధరమ్‌ తేజ్‌ పేరు మార్చుకున్నారు. అదేంటంటే?

Updated : 09 Mar 2024 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) పేరు మార్చుకున్నారు. మాతృమూర్తి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు పేర్కొన్నారు. నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ పేరు పెట్టానన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘సత్య’ (Satya) ప్రెస్‌ మీట్‌ వేదికగా ఆ సంగతి చెప్పారు.

తన కొత్త సినిమా ‘గాంజా శంకర్‌’ ఆగిపోయిందనే విషయంపై విలేకరి స్పందన కోరగా.. ఓ వెబ్‌సైట్‌లో ఆ సినిమా నిలిచిపోయిందనే ఆర్టికల్‌ చదివానని, ఆ తర్వాత అప్‌డేట్‌ గురించి తనకు తెలియదని సాయి తేజ్‌ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆ సైట్‌ రాసిన వార్త వల్లే ఆ విషయం తనకు తెలిసిందన్నారు. రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘‘నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ మావయ్యలతో కలిసి నటించా. తర్వాత చిరంజీవి మామయ్యతో కలిసి తెరను పంచుకోవాలనేది లక్ష్యం. ఆ డ్రీమ్‌ పూర్తయ్యాక మా ఫ్యామిలీలోని ఇతర హీరోలతో కలిసి నటిస్తా’’ అని అన్నారు.

సాయి ధరమ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రమే ‘సత్య’. నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మ్యూజికల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవల నిర్వహించిన టౌలౌజ్‌ షార్ట్స్‌ ఫెస్ట్‌ (ఫ్రాన్స్‌)లో ప్రదర్శితమై, ఎనిమిది అవార్డులు, ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రెండు పురస్కారాలు కైవసం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని