Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరుతో మోసం.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన హీరో

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ప్రొడక్షన్ హౌస్‌ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలని అతని టీమ్ తెలిపింది.

Published : 31 Jan 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌’ పేరుతో కొందరు మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని వారిని నమ్మొద్దని సల్మాన్‌ ఖాన్‌ హెచ్చరించారు. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని మోసం చేస్తున్నట్లు తెలిపారు.

‘సల్మాన్‌ ఖాన్‌, ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రస్తుతం ఏ సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహించడం లేదు. ఇందుకోసం ఏ ఏజెన్సీని నియమించుకోలేదు. మా పేరుతో వచ్చే ఫోన్లు, ఈమెయిల్స్‌ నమ్మొద్దు. అలా మోసం చేసే వారిపై త్వరలోనే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాం. అతని పేరును ఉపయోగించి నేరాలకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సల్మాన్‌ టీమ్ వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్ పేరుతో మోసాలకు పాల్పడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ కొందరు ఇలా ఫేక్‌ ఈమెయిల్స్‌ చేస్తే.. టీమ్ స్పందించింది. 2011లో సల్మాన్‌ఖాన్‌ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీని ప్రారంభించారు. దీనినుంచి వచ్చే డబ్బులను ఛారిటీకి ఉపయోగిస్తారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘టైగర్‌3’తో విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే షారుక్‌తో కలిసి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో  భారీ పోరాటాల్ని చూపించనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని