Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్‌ ఖాన్‌

ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయని స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)అన్నారు. సినిమాకు కనీసం రూ.వెయ్యి కోట్ల వసూళ్లు బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Published : 22 Sep 2023 17:51 IST

ముంబయి: ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలు మంచి జోష్‌ మీద ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పఠాన్‌’తో రూ.వెయ్యి కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాడు షారుక్‌ ఖాన్‌. అలాగే ‘జవాన్‌’ (Jawan) వసూళ్లు పరిశీలిస్తే ఇది కూడా ఆ రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఈ కలెక్షన్ల విషయంపై స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు రూ.100 కోట్లు వసూళ్లు చేశాయంటే అది చాలా తక్కువ అని అర్థం. పంజాబీ, హిందీ, మరాఠి ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ సినిమాలు కనీసం రూ.400కోట్ల నుంచి రూ.600కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకులు సినిమాలను థియేటర్లో రెండోసారి కూడా చూడాలని కోరుకుంటున్నారు. అందుకే రూ.100కోట్ల వసూళ్లు అనేది పెద్ద విషయం కాదు. అందుకే ఓ సినిమాకు నేను రూ.వెయ్యి కోట్లు బెంచ్‌మార్క్‌ ఉండాలని భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇక ఈ అంచనాలు తన సినిమాలకు పనిచేయడం లేదంటూ సల్మాన్‌ ఖాన్‌ చమత్కరించారు. అలాగే తన మాటల ఆధారంగా సినిమాను అంచనా వేయొద్దని అన్నారు. 

‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్‌

 ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ (Tiger 3)లో నటిస్తున్నారు. ఇందులో షారుక్‌ కూడా మెరవనున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో వీళ్లిద్దరి మధ్య భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. కత్రినాకైఫ్‌ కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని