Samantha: ఎక్కడికి వెళ్లినా వీళ్లు నన్ను వదలడం లేదు: సమంత

ఎక్కడికి వెళ్లినా ఓ ఇద్దరు వ్యక్తులు తనని అస్సలు వదలడం లేదంటున్నారు అగ్రకథానాయిక సమంత. ఓవైపు యాక్షన్‌, మరోవైపు ప్రేమ కథా చిత్రాల షూటింగ్స్‌తో ఈ భామ ఫుల్‌ బిజీగా అయ్యారు..

Published : 14 May 2022 02:32 IST

హైదరాబాద్‌: ఎక్కడికి వెళ్లినా ఓ ఇద్దరు వ్యక్తులు తనని అస్సలు వదలడం లేదంటున్నారు అగ్రకథానాయిక సమంత. ఓవైపు యాక్షన్‌, మరోవైపు ప్రేమ కథా చిత్రాల షూటింగ్స్‌తో ఈ భామ ఫుల్‌ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈమె తన తదుపరి సినిమా చిత్రీకరణలో భాగంగా గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌లో ఉంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఈసినిమా సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ సామ్‌ టీమ్‌ మాత్రం ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. సమంత ఫిట్‌గా ఉండేలా వాళ్లు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. షూటింగ్స్‌ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి ఆమెకు ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సామ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెట్టారు. ‘‘అమన్‌ కరానీ, జునైద్‌ షేక్‌లతో నా మార్నింగ్స్‌. నేను ఎక్కడికి వెళ్లినా.. వీళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నా. అన్నివిధాలుగా మంచి సౌకర్యాలు, రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు హోటల్‌వారికి ధన్యవాదాలు. నేను వర్కౌట్లు చేసుకునేందుకు కావాల్సిన స్క్వాట్ ర్యాక్స్‌ని బాల్‌రూమ్‌లోకి అనుమతించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు’’ అని సమంత రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని