Samantha: ‘యశోద’.. ఉత్కంఠగా సమంత ఫస్ట్‌ గ్లింప్స్‌

అగ్రకథానాయిక సమంత నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. దర్శకద్వయం హరి-హరీష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న...

Updated : 05 May 2022 14:04 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. దర్శకద్వయం హరి-హరీష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘యశోద’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. కాగా, తాజాగా ఈసినిమా నుంచి సమంత రోల్‌ని అందరికీ పరిచయం చేస్తూ ‘యశోద’ ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో సామ్.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు చూపించారు. మరి సమంతకు ఎదురైన ప్రమాదం? దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఇలాంటి ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకనుంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌రాజ్‌.. తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని