Samantha: బాత్‌ టవల్‌లో సమంత సెల్ఫీ.. ఫొటో వైరల్‌

సెల్ఫీ తీసుకోవడం, వాటిని అభిమానులతో పంచుకోవడం సమంతకు కొత్తేమీ కాదు. కానీ, ఆమె దుస్తులు ధరించకుండా బాత్‌ టవల్‌తో సెల్ఫీ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated : 12 May 2022 13:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత(Samantha) సెల్ఫీలు ఆమె అభిమానులకు కొత్తేమీ కాదు. కానీ, దుస్తులు ధరించకుండా కేవలం బాత్‌ టవల్‌తోనే సెల్ఫీ తీసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి విషయాన్ని, తాను తీసుకున్న ఫొటోల్ని సమంత నిరభ్యంతరంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌’లో అప్‌లోడ్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌ అయింది. ఇందులో సమంత ఓ అద్దం ముందు నించొని కనిపించింది. ‘‘నువ్వు చాలా గ్రేట్‌. లవ్ యు’’ అని సమంతను ఉద్దేశించి స్టైలిష్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన రాసిన నోట్‌ ఆ మిర్రర్‌పై కనిపించింది. ‘‘నీరజా.. నేనూ నిన్ను మిస్‌ అయ్యా. తిరిగి వచ్చేయ్‌. నువ్వు పంపిన ఈ క్యూట్‌ నోట్‌కు థ్యాంక్స్‌’’ అని సమంత ఫొటోను షేర్‌ చేసింది.

ఇటీవల, ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌తోనూ సమంత అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రత్యేక గీతాల్లో నర్తించేందుకైనా, యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకైనా ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉన్నానని, గతంలో ఇలాంటివి చేసేందుకు ధైర్యం చాల్లేదని సదరు మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ ఏడాది ‘కాతువాకుల రెండు కాదల్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా విజయ్‌ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే విదేశీ చిత్రంలోనూ నటించనుంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని