Sandeep Reddy: సందీప్ వంగా చిత్రాలపై ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య విమర్శలు.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన దర్శకుడు

సందీప్‌ వంగా చిత్రాలను ఆమిర్‌ఖాన్ మాజీ భార్య విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

Published : 03 Feb 2024 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు దర్శకుడు సందీప్ వంగా. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఒక వర్గం ప్రేక్షకులు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కబీర్‌సింగ్‌’, ‘యానిమల్‌’చిత్రాలు స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో సందీప్‌  (Sandeep Reddy Vanga) స్పందించారు.

కిరణ్ రావు వ్యాఖ్యలు తనదాకా వచ్చాయని తెలిపిన ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘నేను ఆమెకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘దిల్‌’ సినిమా చూడండి. అందులో ఒక నటిపై దారుణమైన సన్నివేశాలు చిత్రీకరించారు. తనను అత్యాచారం చేయాలని చూసిన వ్యక్తితోనే ప్రేమలో పడినట్లు చూపారు. ఇలాంటివన్నీ ఏంటి? ముందు వీటి గురించి తెలుసుకోండి. తర్వాత నా సినిమాలను విమర్శించండి’ అన్నారు.

నేను బతికే ఉన్నా: పూనమ్‌ పాండే

తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్‌’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. త్వరలోనే దీనికి సీక్వెల్ ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) రానుంది. ఇది 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని, ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మొదలైన్నట్లు సమాచారం. ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ‘‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని