Thalapathy 67: ‘దళపతి67’ సినిమాపై క్రేజీ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిత్రబృందం.. నటీనటులు వీళ్లే

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) ప్రధానపాత్రలో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్(‌Lokesh Kanagaraj) ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని నటీనటులను అధికారికంగా ప్రకటించారు.  

Published : 31 Jan 2023 20:02 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది ‘వారిసు’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో విజయ్‌(Vijay). ఇదే జోష్‌తో ‘దళపతి67’ (Thalapathy 67)(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో పాల్గొంటున్నడానికి సిద్ధమయ్యాడు. ‘విక్రమ్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్న లోకేశ్‌ కనగరాజ్(‌Lokesh Kanagaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలోని నటీనటుల గురించి చిత్రబృందం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నాయి.

సినిమాకు కథానాయకుడు ఎంత ముఖ్యమో ప్రతినాయకుడూ అంతే ముఖ్యం. ఈ సినిమాలో విలన్‌ పాత్రను బాలీవుడ్‌(Bollywood) అగ్ర హీరో సంజయ్‌ దత్‌(Sanjay Dutt) పోషించనున్నారని గత కొన్నిరోజులుగా నెట్టింట వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. చిత్రబృందం పోస్టర్‌ విడుదల చేసింది. ‘‘దళపతి67 లో సంజయ్‌దత్‌ భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని ట్వీట్‌ చేసింది నిర్మాణ సంస్థ. దీనిపై సంజయ్‌దత్‌ మాట్లాడుతూ..‘‘నేను ఈ సినిమా గురించి ఒక్క లైన్‌ వినగానే కచ్చితంగా ఇందులో నటించాలని అనుకున్నాను. ఇంత మంచి ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. 

అలాగే ఈ సినిమా(Thalapathy 67)లో ప్రియా ఆనంద్‌ (Priya Anand), డ్యాన్‌ మాస్టర్‌, నటుడు శాండీ, దర్శకుడు మిస్కిన్‌,  నటుడు మన్సూర్‌ అలీఖాన్‌లు, మాథ్యూ థామస్‌ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ అప్‌డేట్స్‌తో విజయ్‌ సినిమాపై అంచనాలు తారాస్థాయిని తాకుతున్నాయి. విజయ్‌ వర్సెస్‌ సంజయ్‌ కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు విజయ్‌ అభిమానులతో పాటు సినీప్రియులు ఆసక్తిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని