Save The Tigers 2: ‘సేవ్‌ ది టైగర్స్‌-2’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Save the tigers-2: కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్‌ ది టైగర్స్‌కు సీక్వెల్‌గా సీజన్‌2 రాబోతోంది.

Published : 02 Mar 2024 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the tigers). గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దానికి సీక్వెల్‌గా సీజన్‌-2 (Save the tigers-2) రాబోతోంది. శనివారం దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ పంచుకుంది. తొలి సీజన్‌ను మించి నవ్వులు పంచడానికి సిద్ధమైనట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈసారి సీరత్‌కపూర్‌ కీలక పాత్రలో నటించారు. మహి వి. రాఘవ, ప్రదీప్‌ అద్వైతం రూపొందించిన ‘సేవ్‌ ది టైగర్స్‌2’కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని