Shah Rukh Khan: షారుక్‌-సల్మాన్‌ల మల్టీస్టారర్‌.. టైటిల్‌ ఇదేనా!

షారుక్‌ ఖాన్ (Salman Khan), సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Published : 16 Sep 2023 16:23 IST

ముంబయి: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలనగానే గుర్తొచ్చే పేర్లు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ (Salman Khan). వీళ్లిద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే బీటౌన్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. షారుక్‌ (Shah Rukh Khan), సల్మాన్‌ ఖాన్‌లకు ఈ కథను కూడా వినిపించారట. దానికి ఇద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనికి టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేశారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చిలో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ భారీ మల్టీ స్టారర్‌కు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్నారట. 

హీరో అవుతానంటే ఎవరూ నమ్మలేదు.. చిన్నప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొన్నా: కిరణ్‌ అబ్బవరం

ఇక ఈ చిత్రానికి ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ (Tiger vs Pathaan) అని అనుకుంటున్నారుని టాక్‌ వినిపిస్తోంది. ఇక వీళ్లిద్దరూ కలిసి మొదటి సారి 1995లో ‘కరణ్‌ అర్జున్‌’ అనే చిత్రంలో నటించారు. హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మళ్లీ దాదాపు 28ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఇక తాజాగా ‘జవాన్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న షారుక్‌ ప్రస్తుతం ‘డుంకీ’లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’(Tiger 3)లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని