Shiva Rajkumar: ఆ ఇద్దరు హీరోలు నాకు రెండు కళ్లతో సమానం: శివరాజ్‌ కుమార్‌

‘జైలర్‌’తో తెలుగు వాళ్లకు దగ్గరయ్యారు నటుడు శివరాజ్‌ కుమార్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పారు.

Published : 19 Oct 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కన్నడ స్టార్‌ హీరో శివరాజ్ కుమార్‌ (Shiva Rajkumar) తన అద్భుతమైన నటనతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇద్దరు హీరోలంటే ఇష్టమని అన్నారు.

‘బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌లకు నేను వీరాభిమానిని. వాళ్లిద్దరు నాకు చాలా ఇష్టం. నా రెండు కళ్లతో సమానం. కమల్‌ హాసన్‌ తన కళ్లతోనే హావభావాలు పలికించగలరు. ఇక అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ తన పాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు తెలియని సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ‘అగ్నిపథ్‌’లోని పాత్రను స్ఫూర్తిగా తీసుకోని ‘ఘోస్ట్’ సినిమాలో నా పాత్రను రాశారు. ప్రత్యేకించి బాడీ లాంగ్వేజ్ విషయంలో ఆయనలా చేయడానికి ప్రయత్నించాను’ అని చెప్పారు. అలాగే, తన సోదరుడు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మాట్లాడుతూ.. అతడు మన మధ్య లేడని అనుకోవడం లేదని.. ఎప్పటికీ మనతోనే ఉంటాడని చెప్పారు. ఇక తాజాగా ‘ఘోస్ట్‌’ (Ghost) సినిమాతో శివరాజ్ కుమార్‌ పాన్‌ ఇండియా ప్రేక్షకులను పలకరించారు. దీనికి శ్రీని దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని